ఆ ఒక్క టెస్టే చూసి కంగారు పడకండి.. మీకు షుగర్ లేకపోయినా ఉన్నట్లే చూపిస్తుంది!
- రక్తహీనత ఉంటే హెచ్‌బీఏ1సీ పరీక్ష తప్పు రావచ్చన్న నిపుణులు
- ఐరన్ లోపం వల్ల షుగర్ ఎక్కువగా చూపిస్తుందని వివరణ
- ఫలితంగా డయాబెటిస్ లేకపోయినా ఉన్నట్లు తప్పుడు నిర్ధారణ
- ఐరన్ చికిత్సతో 70 శాతం మందికి నార్మల్ షుగర్
- షుగర్ పరీక్షతో పాటు సీబీసీ కూడా అవసరమంటున్న వైద్యులు
కేవలం ఒక్క బ్లడ్ టెస్ట్ ఆధారంగా భారత్‌లో లక్షలాది మందికి షుగర్ లేదా ప్రీడయాబెటిస్ ఉందని నిర్ధారిస్తున్నారు. ముఖ్యంగా గత మూడు నెలల సగటు షుగర్ శాతాన్ని తెలిపే ‘హెచ్‌బీఏ1సీ’ పరీక్షను ఇందుకు వాడుతున్నారు. అయితే శరీరంలో రక్తం తక్కువగా ఉంటే (రక్తహీనత లేదా అనీమియా) ఈ టెస్ట్ రిపోర్ట్ తప్పుగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తహీనత లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారికి హెచ్‌బీఏ1సీ పరీక్ష కచ్చితమైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చని వివరించారు. 2026 ఫిబ్రవరిలో వచ్చిన ‘ది లాన్సెట్’ నివేదిక కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది.
రక్తంలో ఐరన్ లోపం వల్ల ఎర్ర రక్తకణాలు ఎక్కువ కాలం జీవిస్తాయి. దీనివల్ల వాటిపై గ్లూకోజ్ ప్రభావం ఎక్కువగా ఉండి సాధారణం కంటే ఎక్కువ హెచ్‌బీఏ1సీ రీడింగ్ చూపిస్తుంది. అంటే శరీరంలో షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉన్నప్పటికీ.. రక్తహీనత కారణంగా రిపోర్ట్‌లో మాత్రం షుగర్ ఎక్కువగా ఉన్నట్లు (ఉదాహరణకు 6.4 శాతం) కనిపిస్తుంది. దీనివల్ల డయాబెటిస్ లేకపోయినా ఉన్నట్లు తప్పుడు నిర్ధారణకు వచ్చే ప్రమాదం ఉంది. ఒక పరిశోధన ప్రకారం.. ఇలా ప్రీడయాబెటిస్ బారిన పడినట్లు రిపోర్ట్ వచ్చిన వారికి కేవలం మూడు నెలల పాటు ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తే, వారిలో 70 శాతం మందికి మళ్లీ షుగర్ లెవెల్స్ పూర్తిగా నార్మల్కు వచ్చాయి.
భారతదేశంలో ముఖ్యంగా మహిళలు, యువతులు, వృద్ధులలో ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత చాలా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు నగరాల్లో ప్రతి ఏటా చేయించుకునే హెల్త్ చెకప్‌లలో హెచ్‌బీఏ1సీ పరీక్షను సర్వసాధారణంగా చేస్తుంటారు. కాబట్టి మీ రిపోర్ట్‌లో షుగర్ బోర్డర్లో ఉందని తేలితే.. వెంటనే కంగారు పడిపోవద్దు. ఆ రిపోర్ట్‌ను నమ్మే కంటే ముందే మీకు రక్తహీనత ఉందో లేదో తెలుసుకోవడానికి ‘కంప్లీట్ బ్లడ్ కౌంట్’ పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ ఐరన్ లోపం ఉంటే ముందు దానికి చికిత్స తీసుకుని, ఆ తర్వాతే మళ్లీ షుగర్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ల్యాబ్ రిపోర్ట్‌లో వచ్చే ఒకే ఒక్క నంబర్ మీ ఆరోగ్యానికి ఆఖరి తీర్పు కాదని వైద్యులు చెప్తున్నారు.